అమెరికా మధ్యంతర ఎన్నికల్లో బరిలోకి డజనుకు పైగా భారతీయ సంతతి అభ్యర్థులు
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
అమెరికాలో సమీపిస్తున్న మధ్యంతర ఎన్నికల్లో భారతీయ మూలాలున్న అభ్యర్థులు కీలక పదవుల కోసం బరిలో నిలిచారని జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ జోశ్యుల తెలిపారు. నవంబర్ 3న జరగనున్న ఈ ఎన్నికల్లో ఓహియో గవర్నర్, న్యూయార్క్ అటార్నీ జనరల్, అమెరికా కాంగ్రెస్ వంటి అత్యంత కీలక స్థానాల కోసం డజనుకు పైగా భారతీయ సంతతి నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండో పదవీకాల రాజకీయ దిశను ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తాయని విశ్లేషించారు.