హైదరాబాద్ మదన్నపేటలో గణేష్ అన్నదాన వేడుకల వద్ద కలకలం

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

హైదరాబాద్‌లోని మదన్నపేట ప్రాంతంలో గణేష్ నిమజ్జనం మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా, ఎముకలు, ఆహార వ్యర్థాలతో కూడిన ప్యాకెట్‌ను విసిరేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు మరియు హిందూ సంఘాల ప్రతినిధులు చాంచల్‌గూడలో భారీ నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న చార్మినార్ జోన్ డిసిపి కిరణ్ ఖరే వెంటనే స్పందించి, మహ్మద్ ఇమ్రాన్ ఖురేషి, అర్షియా బేగం, సమ్మీన అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి హెచ్చరించారు. ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉందని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.