క్వాడ్ విదేశాంగ మంత్రుల కీలక సమావేశం: నావిగేషనల్ హక్కుల పరిరక్షణకు స్పష్టమైన పిలుపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
అట్లాంటా వేదికగా జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నావిగేషనల్ హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించాలని కోరినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. హార్ముజ్ జలసంధి, ఎర్రసముద్రం ప్రాంతాల్ లో వాణిజ్య నౌకల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మంత్రులతో కలిసి ఆయన స్పష్టం చేశారు. సరఫరా గొలుసులపై ఆర్థిక బలప్రయోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ప్రకారం రక్షణ కల్పించాలని నేతలు పిలుపునిచ్చారు.