బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నటి దక్షి గుత్తికొండ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ప్రముఖ నటి దక్షి గుత్తికొండ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారని షో నిర్వాహకులు తెలిపారు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, రామ్‌గోపాల్ వర్మ కరోనా సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతీరుతో అలరించేందుకు ఆమె సిద్ధమయ్యారు.