మున్సిపల్ ఎన్నికలు: కౌన్సిలర్లుగా గెలుపొందిన తల్లీకొడుకులు మరియు భార్యాభర్తలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: పాలకొండ

మున్సిపల్ ఎన్నికల్ లో పలు ప్రాంతాల్ లో కుటుంబ సభ్యులు ఏకకాలంలో విజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించారని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో తల్లీకొడుకులు గంటా వరలక్ష్మి, సంతోష్లు వేర్వేరు వార్డుల నుంచి కౌన్సిలర్లుగా గెలుపొందగా, మైదుకూరులోనూ భానునందన్, పార్వతి విజయం సాధించారు. అలాగే విశాఖపట్నంలో తండ్రీకూతుళ్లు, ఇచ్ఛాపురం, హిందూపురంలో భార్యాభర్తలు కౌన్సిలర్లుగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు.