కేരളలో విషాదం: చెరువులో నవదంపతుల మృతదేహాలు లభ్యం

రిపోర్టర్: కృష్ణ స్థలం: కేరళ

కేరళలోని కొల్లం జిల్లా శాస్తంకోట్ట సరస్సులో నవదంపతులు రాజీవ్, అభిరామి శవాలై తేలడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదురించి నాలుగు నెలల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచి కుటుంబాలకు దూరంగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం సరస్సులో అభిరామి, కొద్ది దూరంలో రాజీవ్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.