నేరాల నియంత్రణపై విశాఖ పోలీస్ కమిషనర్ కీలక సమీక్ష

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్వహించినట్లు VizagCityPolice వెల్లడించారు. కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో పెండింగ్ కేసుల పురోగతి, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ రద్దీ నియంత్రణపై చర్చించారు. మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సైబర్ క్రైమ్ కేసుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సీపీ ఆదేశించారు. నగరంలో గంజాయి రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలని పోలీసు అధికారులను స్పష్టం చేశారు.