వారణాసి సినిమా షూటింగ్‌కు ప్యాకప్ చెప్పిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు
రిపోర్టర్: సతీష్
స్థలం: వారణాసి
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. అయోధ్య బ్యాక్‌డ్రాప్‌లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి మహేశ్ బాబు తన షూటింగ్ పోర్షన్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం వారణాసి సినిమాకు ఆయన ప్యాకప్ చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.