నెల్లూరులో పాతకక్షల దాడులపై పోలీసుల తీవ్ర హెచ్చరిక జారీ

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరంలో ఇటీవల పాతకక్షల నేపథ్యంలో దాడులు, హత్యలు పెరిగిపోవడంపై పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రౌడీషీటర్లు, పగలతో రగిలిపోతున్న వ్యక్తుల కారణంగా అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని పోలీసులు తెలిపారు. పుస్తకాలు పట్టాల్సిన చిన్నారులు కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వెలిబుచ్చారు. ఆవేశాలను అణచుకుని, కుటుంబం కోసం ప్రశాంతంగా జీవించాలని రౌడీషీటర్లకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.