భద్రాచలం ఆస్పత్రిలో అస్వస్థత పిల్లల పరామర్శ
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ ఆదేశాల మేరకు జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామానికి చెందిన అస్వస్థతకు గురైన పాఠశాల విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భద్రాచలం పంచాయతీ ప్రెసిడెంట్ పూనం కృష్ణ, నాయకులు వడ్డే రఘుబాబు, రామసూరి రెడ్డి, క్రిస్టియన్, మడకం వీరయ్య, పసుపులేటి సత్యనారాయణ తదితరులు పాల్గొని విద్యార్థులకు ధైర్యం చెప్పారు.