మైపాడు సముద్ర తీరంలో ఘనంగా అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవం
రిపోర్టర్: sujith reddy
స్థలం: ఇందుకూరుపేట
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ విభాగం మరియు ఎన్ఐఓటి చిట్టేడు సంయుక్తంగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మైపాడు సముద్ర తీరంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె. సునీత, శాస్త్రవేత్త డాక్టర్ దేవిరాం గార్లపాటి తదితరులు పాల్గొని తీర ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.