కోటిపల్లి - నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు

రిపోర్టర్: సునీల్ స్థలం: కోనసీమ

కోటిపల్లి - నరసాపురం రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల వేగవంతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వంద కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందని అమలాపురం ఎంపీ, టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ (బాలయోగి) వెల్లడించారు. ఈ మేరకు కోనసీమ జిల్లా అభివృద్ధికి మరియు రవాణా సౌకర్యాల మెరుగుపడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంటూ ఆయన ఈ కీలక విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో పంచుకున్నారు.