జన్నారంలో ఉపాధి హామీ రికార్డులను క్షుణ్ణంగా జల్లెడ పడుతున్న బృందాలు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ జరుగుతోంది. మండలంలోని ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన పనులు, కూలీలకు వేతనాల చెల్లింపుపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఆర్పి నాగరాజు మంగళవారం వెల్లడించారు. పది మంది బృందం సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలిస్తూ క్షుణ్ణంగా సోషల్ ఆడిట్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.