ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వెలుగుచూసిన భారీ అవకతవకలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నట్లు కమిటీ సభ్యులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో రూ.8.22 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందని వారు పేర్కొన్నారు. చేసిన పనులకు నిధులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. అలాగే జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల వాయిదాపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.