కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు కన్నీళ్లు అంటూ హరీష్ రావు ఫైర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణకు తీవ్రమైన అన్య జరుగుతోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రా ప్రభుత్వం అన్ని పంప్‌హౌస్‌లు ఆన్ చేసి నీళ్లు తరలిస్తుంటే, కృష్ణా నదిలో నీరు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోటార్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ఇది సహజ సిద్ధంగా వచ్చిన కరువు కాదని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టిన కృత్రిమ కరువు అని ఆయన ఘాటు విమర్శలు చేశారు.