నిజామాబాద్ సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత నక్కా సుశీల

రిపోర్టర్: హరి స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీల రాణి లొంగిపోయారు. పోలీసుల నిరంతర నిఘా, ప్రభుత్వ పునరావాస కార్యక్రమాల ప్రభావంతో ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తం 266 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. హింసామార్గం వీడి మిగిలిన వారు కూడా లొంగిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.