త్రిభాషా విధానం అమలును వాయిదా వేయాలని సుప్రీంకోర్టు సూచన

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో 6వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిపాదించిన త్రిభాషా విధానం అమలును మరో ఏడాది పాటు వాయిదా వేసి, 2027 నుంచి అమలు చేయాలని సుప్రీంకోర్టు గురువారం కీలక సూచన చేసింది. విద్యార్థులపై చదువుపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు ఈ వెసులుబాటు దోహదపడుతుందని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ అభిప్రాయపడ్డారు. ఈ సూచనను సీబీఎస్ఈ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సానుకూలంగా స్వాగతించారు.