విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా: ఈనెల 29న పోలింగ్ నిర్వహణ

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఒక రోజు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రసిద్ధ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 29న పోలింగ్ జరుగుతుందని, కౌంటింగ్ తేదీలో ఎలాంటి మార్పు లేదని ఎస్ఈసీ పేర్కొంది.