విజయవాడలో నిర్లక్ష్యం: ఒక చేత్తో రెండు ఫోన్లు పట్టుకుని అత్యంత ప్రమాదకరంగా డ్రైవింగ్
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయవాడ
డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడమూ అంతే ప్రమాదకరమని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. విజయవాడ రామకృష్ణాపురంలో తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. చిత్రంలోని ఒక యువకుడు ఏకంగా ఒక ఫోన్లో మాట్లాడుకుంటూ, మరో ఫోన్‌ను పరిశీలిస్తూ బైక్ నడుపుతూ కనిపించాడు. ఒకే చేత్తో వాహన హ్యాండిల్‌ను పట్టుకుని చేసిన ఈ విన్యాసం చూసేవారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.