'మూడేళ్ల విరామం తర్వాత భారత్‌లోనే ఐపీఎల్ వేలం': బీసీసీఐ ప్రకటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలాన్ని స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. గత మూడేళ్లుగా విదేశాల్లో జరిగిన వేలాలు ఈసారి భారత్‌లోనే జరగనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ధృవీకరించారు. గతంలో దుబాయ్, జెడ్డా, అబుదాబి వేదికలుగా వేలాలు జరుగగా, ఈసారి వేదికపై త్వరలో స్పష్టత రానుంది. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై కూడా ఫ్రాంచైజీల అభిప్రాయాలను సేకరించి మరోసారి సమీక్షించనున్నారు.