గుర్దాస్పూర్ జిల్లాలో దారుణం: ఆస్తి వివాదంతో సెలవుపై వచ్చిన సైనికుడిపై దాడి
రిపోర్టర్: గోపి
స్థలం: గుర్దాస్‌పూర్
పంజాబ్ లోని గుర్దాస్పూర్ జిల్లాలో ఆస్తి వివాదం కారణంగా సెలవుపై ఇంటికి వచ్చిన వజీర్ సింగ్ అనే సైనికుడిపై తల్లి, తమ్ముడు మరియు బంధువులు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితుడి భార్య సిమ్మి సైనీ వెల్లడించారు. సైనుకుడు కట్టిన దుకాణం వద్దకు చర్చల కోసం పిలిచి కర్రలతో దాడి చేశారని, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఏఎస్ఐ జై సింగ్ తెలిపారు.