ముగిసిన ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు గడువు ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా 13.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 24 నాటికి పూర్తి చేసి, అక్టోబర్ 1 నుండి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ఉన్న హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ లోపాలను సరిచేస్తూ ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.