'40 ఏళ్ల భోగాపురం ప్రజల కల సాకారం!': రైతుబజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

రిపోర్టర్: నరేష్ స్థలం: భోగాపురం

భోగాపురం మండలంలో రూ.74 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రైతుబజార్‌ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 40 ఏళ్ల ప్రజల కల సాకారమైందని తెలిపారు. రైతుబజార్‌లో రైతుల వద్ద నుంచి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి తొలి బోణి చేసిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.