ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతల అరెస్ట్: జంతర్ మంతర్ వద్ద కలకలం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంక, అజి షిండేలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీజేపీ లీగల్ టీమ్ హెడ్ రత్నా సింగ్ వెల్లడించారు. బారికేడ్లు దాటి నినాదాలు చేసినందుకు వారిపై అక్రమ ప్రవేశం, బాండ్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.