మున్సిపల్ కౌంటింగ్ కోసం పటిష్ట భద్రతతో సిద్ధమైన యంత్రాంగం
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
నవంబర్ మూడవ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీతో పాటు ఇచ్ఛాపురం మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ విషయాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా వెల్లడించారు. బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లలో అత్యంత భద్రంగా ఉంచామని, అన్ని కేంద్రాల్లోనూ ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని వారు తెలిపారు.