చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం కఠిన చర్యలు: నిల్వల పరిమితి కుదింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపులోకి తెచ్చేందుకు డీలర్ల నిల్వల పరిమితిని కేంద్ర ప్రభుత్వం సవరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఉన్న రెండు వేల క్వింటాళ్ల నిల్వ పరిమితిని వెయ్యి క్వింటాళ్లకు కుదించామని పేర్కొన్నారు. డీలర్లు పదిహేను రోజులకు మించి నిల్వ ఉంచరాదని స్పష్టం చేశారు. ఈ నూతన నిబంధనలు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ ముప్పై వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.