సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో కీలక నిందితుడు లొంగిపోవడంతో విచారణ ముమ్మరం
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
సాయికృష్ణ కస్టోడియల్ మృతి, శవం మాయం కేసులో గత రెండున్నర నెలలుగా పరారీలో ఉన్న నాల్గవ నిందితుడు సురేష్ ఎట్టకేలకు అమరావతిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సీఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడైన సురేష్ ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్‌ను అధికారులు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సుదీర్ఘంగా విచారించగా, పలు ప్రశ్నలకు అతను నీళ్లు నమిలినట్లు సమాచారం. శుక్రవారం నిందితుడిని సిట్ అధికారులు రెండో ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో హాజరుపర్చనున్నారు.