పులివెందులలో ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: పులివెందుల

పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద తమ పార్టీ ఏజెంట్లను అడ్డుకున్నారని, ఓటింగ్ ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందులలో ఎన్నికలను రద్దు చేసి తిరిగి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరు సరిగా లేదంటూ ఆయన మండిపడ్డారు.