తీవ్ర అలర్ట్: డిసెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి ఎల్నినో పరిస్థితులు

రిపోర్టర్: అశోక్ స్థలం: Global

ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో హెచ్చరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎల్నినో గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, మరికొన్ని చోట్ల భారీ వరదలు సంభవించే ముప్పు ఉందని తెలిపారు.