ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్మెంట్ టెస్ట్ హాల్ టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రిక్రూట్మెంట్ పరీక్షల ద్వారా మొత్తం 660 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ప్రవేశ పత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని రిక్రూట్మెంట్ సెల్ స్పష్టం చేసింది. అక్టోబర్ 3 నుండి 5వ తేదీ వరకు ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.