రూ.30 కోట్లతో గూడూరులో అభివృద్ధి పనులు ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్‌గా నిర్వహించిన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ పథకం పనుల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా, గూడూరు పట్టణ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గూడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి మరియు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు.