లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: అశోక్ స్థలం: ఫగ్వారా

పంజాబ్లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులతో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొందని కపుర్తలా ఎస్ఎస్పీ గౌరవ్ తూరా తెలిపారు. క్యాంపస్ భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగి జాతీయ రహదారిని దిగ్బంధించారని, అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఫిర్యాదు లేదా ఆధారాలు అందలేదని స్పష్టం చేస్తూ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారని వెల్లడించారు.