ఫుట్బాల్ మ్యాచ్లో బీర్ తాగుతున్నట్లు సెలబ్రేట్ చేసిన ఆటగాడికి జరిమానా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: టెక్సాస్
అమెరికన్ ఫుట్బాల్ మ్యాచ్లో టచ్డౌన్ వేళ బీర్ తాగుతున్నట్లు అభినయించిన ఆటగాడు మాట్ గొన్కాల్వెస్కు ఎన్ఎఫ్ఎల్ ఎనిమిది వేల డాలర్లకు పైగా జరిమానా విధించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై ట్రావిస్ కెల్సే మద్దతు ఉన్న గారేజ్ బీర్ కంపెనీ స్పందించి ఆ జరిమానాను తామే చెల్లిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.