ఎల్ నినో కష్టాలపై కూటమి ప్రభుత్వ పక్కా జలవ్యూహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కరువు కోరల్లో రాష్ట్రం చిక్కుకోకుండా పక్కా జలవ్యూహాన్ని అమలు చేస్తోంది. రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సహిస్తూ వారిని నష్టాల బారిన పడకుండా కాపాడుతోంది.