స్టాలిన్‌ను అవమానించలేదన్న తమిళనాడు సీఎం విజయ్

రిపోర్టర్: హరి స్థలం: తమిళనాడు

అసెంబ్లీలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ స్పష్టం చేశారు. ప్రసంగ సమయంలో తన శరీర భాష అనుకోకుండా అలా వచ్చిందే తప్ప, ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదని ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. స్టాలిన్ దవడ గాయాన్ని హేళన చేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.