పాముకుంట గ్రామంలో పంపిణీ: అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంట గ్రామంలో బుధవారం నాడు అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ రంగ నరేష్ గౌడ్ ఘనంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఈ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.