ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని జేఏసీ డిమాండ్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటిలోగా అమలు చేస్తుందని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రశ్నించారు. కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు? మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఎప్పటి నుంచి అందిస్తారు? బతుకమ్మ చీరల పంపిణీ ఏమైందని నిలదీశారు. పెండింగ్లో ఉన్న హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.