గోరుకల్లు రిజర్వాయర్ గేట్ ఎత్తివేయడంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు
రిపోర్టర్: సురేష్
స్థలం: నంద్యాల జిల్లా
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు రిజర్వాయర్ ఔట్‌ఫాల్ రెగ్యులేటర్ గేట్‌ను ఆకతాయిలు ఎత్తడంతో భారీగా నీరు బయటకు వచ్చి సమీప గ్రామాన్ని ముంచెత్తింది. కట్ట తెగిపోయిందని భయపడిన గ్రామస్థులు సెల్‌ఫోన్ల వెలుగులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండపైకి పరుగులు తీశారు. ఎలక్ట్రీషియన్ కోటయ్య సకాలంలో స్పందించి మాన్యువల్‌గా గేట్ దించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.