ఓటమికి సాకులు వెతకడం మానుకొని కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని పురందేశ్వరి హితవు

రిపోర్టర్: గోపి స్థలం: తూర్పు గోదావరి

ఓటమికి సాకులు వెతకడం మానుకొని కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హితవు పలికారు. దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ, ప్రతి ఎన్నికల్లోనూ ఎదురవుతున్న పరాజయాలకు కొత్త కారణాలు వెతకడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. తమిళనాడులో యాభై తొమ్మిది సంవత్సరాలుగా, అలాగే పశ్చిమ బెంగాల్లో నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉందని ఆమె ఎత్తిచూపారు.