క్యాన్సర్ బారిన భార్య కోసం డెలివరీ బాయ్గా పనిచేస్తున్న వృద్ధుడు

రిపోర్టర్: సునీల్ స్థలం: డల్లాస్

అమెరికాలోని డల్లాస్ ప్రాంతానికి చెందిన 81 ఏళ్ల డొనాల్డ్ జాన్సన్ తన భార్య జోసెఫిన్ క్యాన్సర్ చికిత్స ఖర్చుల కోసం ఈ వయసులోనూ లగేజ్ డెలివరీ బాయ్గా కష్టపడుతున్నారు. 57 ఏళ్ల వివాహ బంధం కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి చలించిన ఏరిన్ హవెల్ అనే మహిళ గోఫండ్మీ ద్వారా విరాళాలు సేకరించి వారికి ఆర్థిక సాయం అందించారు. భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో ఆయన సాగిస్తున్న ఈ ప్రయాణం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.