యువతుల్లోనూ రొమ్ము క్యాన్సర్ ముప్పు: ఆ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

యువతుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉండే అవకాశం ఉందని, శరీరంలో వచ్చే చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకూడదని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కోడూరు వెల్లడించారు. రొమ్ములో గడ్డలు, చర్మంలో మార్పులు లేదా నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.