గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇవ్వాలి: రైస్ మిల్లర్లను హెచ్చరించిన కలెక్టర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: జగిత్యాల

రబీ సీజన్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 29 లోపు బియ్యం ఇవ్వని వారిని డిఫాల్ట్ మిల్లులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. గడువులోగా డెలివరీ చేయనిచో కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.