పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలి

రిపోర్టర్: MADHIRI CHANTIBABU స్థలం: జి.కె.వీధి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 18 వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గూడెం కొత్త వీధి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, స్థానిక ఎంపీటీసీ పసుపులేటి నాగమణి కోరారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.