తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో వర్షాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో రాగల మూడు గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ (IMD Hyderabad - తెలంగాణ వాతావరణ సూచనలు & వర్ష హెచ్చరికలు) వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.