వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులతో కూటమి సర్కార్ కక్షసాధింపు చర్యలంటూ కాకాణి ధ్వజం

రిపోర్టర్: sujith reddy స్థలం: గూడూరు

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం రామలింగాపురంలో వైఎస్సార్సీపీ నాయకుడు అట్ల శ్రీనివాసులు రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, పోలీసులను అడ్డుపెట్టి ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.