సంగారెడ్డి జిల్లాలో బస్సుల కోసం విద్యార్థుల రోడ్డు ధర్నా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బేలపూర్ గ్రామం వద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సమయానికి బస్సులు రాకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు సక్రమంగా నడపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా, సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.