విశాఖలో ఆకలి తీరుస్తున్న 'మిషన్ జ్యోతిర్గమయ' కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 'మిషన్ జ్యోతిర్గమయ' ప్రాజెక్టు అద్భుతంగా సాగుతోంది. నగరంలో ఏర్పాటు చేసిన 5 కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులకు, ఆకలితో ఉన్న పేదలకు ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందుతోంది. ఈ గొప్ప సేవా కార్యక్రమానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు. ఆహారం అందించాలనుకునే వారు 9490617924 నంబర్‌ను సంప్రదించవచ్చు.