శ్రీకాకుళంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్: పటిష్ట భద్రత మధ్య ప్రశాంతత

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రత మధ్య పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని శ్రీకాకుళం జిల్లా పోలీసు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సహకరించిన ప్రజలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతూ అధికారులు నిబంధనల అమలును స్పష్టం చేశారు.