సర్వేపల్లి నియోజకవర్గంలో విషాదం: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని కలువాయి మండలం తోపుగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ మెకానిక్గా జీవనం సాగిస్తున్న గుంజి చందు స్వగ్రామానికి వెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.