మెగాస్టార్ కాకా చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ దర్శకుడు
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కాకా చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించిందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోందని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.